అమెరికాలో ఈ మధ్య అధ్యక్ష భవనం నుంచి లీకైన పత్రాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ఏమిటంటే ఉక్రెయిన్ రష్యా పై గెలవడం అసాధ్యమని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆ పత్రాల్లో పేర్కొంది. నాటో దళాలు, అమెరికా అండ లేనిదే అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉక్రెయిన్ ఉందంటూ తెలిపింది.


ఉక్రెయిన్ రష్యా చేతిలో లొంగిపోక తప్పదు. నాటో దేశాలు దానికి పూర్తిగా సహాయం చేయడానికి సిద్దంగా  లేవు. ఆయుధాలు అయిపోతాయి. చెప్పిన వినని పరిస్థితిలో ఉక్రెయిన్ ఉంది. దీంతో ఉక్రెయిన్  ఇప్పటి వరకు సాయం చేసిన అమెరికానే నిందించడం చేస్తోంది. ఆయుధాలు ఇచ్చి రష్యాతో పోరాటానికి సాయం చేస్తున్న అమెరికాను తిట్టి పోస్తుంది. ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశమే అని జెలెన్ స్కీ అంటున్నారు.  మా శక్తిని తక్కువగా అంచనా వేయడమే అని అన్నారు.


అమెరికా లో బయట పడ్డ పత్రాల్లో ఉక్రెయిన్ గురించి తక్కువ చేసి చూపడం ఏ మాత్రం సమంజసం కాదని జెలెన్ స్కీ అమెరికా విధానాలను ఎండగట్టారు. ఉక్రెయిన్ ఒక పోరాటంలో ఉంది. అది శక్తిమంతమైన దేశంతో పోరాటం చేస్తోంది. ఇలాంటి సమయంలో చిన్నగా కనిపించొచ్చు అంతా మాత్రానా ఓడిపోతాం అని అమెరికా ఎలా చెప్పగలదు. మా దేశం కోసం మేం పోరాడుతున్నాం. రేపు మరో దేశంపై కూడా ఇలాగే రష్యా దాడి చేయదని గ్యారంటీ ఏమిటి..


ముందుండి నడిపించాల్సిన అమెరికా ఇలా ఉక్రెయిన్ పై విషం  కక్కడం దారుణమని దుయ్య బట్టారు. మా సార్వభౌమత్వం తదితర అంశాల్లో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదని జెలెన్ స్కీ అన్నారు. మేం ఓడిపోతాం అని అనడం సరైనది కాదని జెలెన్ స్కీ అగ్రరాజ్యానికి సూచించారు. గతంలో మా వద్ద ఉన్న అణ్వయుధాలను రష్యాకు అప్పగించేలా చేసి ఇబ్బందుల్లోకి నెట్టింది అమెరికా అని ఆ విషయాన్ని  ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: