క్రిమియా గురించి రష్యా ఉక్రెయిన్ ల మధ్యన ఒక రకంగా పోరాటంలో కీలకమైన భాగం దాని గురించి జరుగుతుందన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ క్రిమియా అనేది ఒకప్పుడు ఉక్రెయిన్ ప్రాంతంలోని ఒక భాగం. ఉక్రెయిన్ మ్యాప్ లోను, అమెరికా యూరప్ మ్యాప్ లలోనూ ఇది కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతానికి ఉక్రెయిన్ తరపున ఒక ప్రతినిధి ఉన్నారు ఆమె పేరు తమీలా తెషావ.


అయితే తాజాగా ఆవిడ  అమెరికా యూరప్ దేశాలు క్రిమియాను వదిలేయమంటున్నాయి‌ అనే విషయం పైన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చిందని తెలుస్తుంది. మొన్న ఉక్రెయిన్ క్రిమియా లోపలి ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడ రైళ్లను ధ్వంసం చేసింది ఇంకా అక్కడ ఉన్నటువంటి విమాన స్థావరాలపై కూడా దాడి చేసింది. అదేవిధంగా ఉక్రెయిన్ అక్కడ ఉన్నటువంటి అత్యవసరమైన ఆయిల్ స్టోరేజీలను కూడా ధ్వంసం చేసింది అని తెలుస్తుంది. ఇదంతా డ్రోన్ల సహాయంతో చేసిందని తెలుస్తుంది.


ఇంతా చేసి ఉక్రెయిన్ ఏమంటుంది అంటే దేవుడు ఇన్నాళ్ళకి చూసాడు, దేవుడే ఇదంతా చేశాడు అన్నట్లుగా చెప్పుకొస్తుంది. ఇప్పుడు అక్కడ మిసైల్స్ దాడిలో ఒక స్కూల్ బస్సులోని పిల్లలు చనిపోయినట్లుగా తెలుస్తుంది. దానితో అమెరికా, యూరప్ దేశాలు ఈ మిసైల్స్ దాడిని తప్పు పడుతున్నాయి. ఇప్పుడు వరకు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేసిన ఈ రెండు దేశాలు  నీ ఆత్మ రక్షణ కోసం మేము సమకూర్చిన ఆయుధాలను నువ్వు దుర్వినియోగం చేస్తున్నావని ఉక్రెయిన్ ను తిడుతున్నాయి ఇప్పుడు.


మేమిద్దరం నీకు ఆయుధాలు ఇచ్చింది రష్యా నీ మీదకి వచ్చినప్పుడు వాడమనే గాని రష్యా మీదికి నువ్వు వెళ్లి దాడి చేయమని కాదు అని గట్టిగానే తిడుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఉక్రేనియన్ ప్రతినిధి మాట్లాడుతూ ఒకప్పుడు క్రిమియా మా దేశంలో భాగం. అలాంటి మా భూభాగాన్ని ఇప్పుడు వదిలేసుకోమంటున్నారా మా క్రిమియాను అమెరికా యూరప్ దేశాలు రష్యాకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాయా అంటూ  ఆవిడ గట్టిగా నిలదీసిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: