పాకిస్థాన్, చైనా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.  ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాను కాదని చైనాతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు పాక్ లో  ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యాడు. దీంతో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి.  పాక్ ప్రధాని షాదాబ్ షరీఫ్ కు సంబంధించిన వారిపై  దాడులు చేస్తున్నారు. వాహనాలు తగలబెడుతున్నారు. రైల్వేలను కాల్చేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మరోక వైపు చైనా వాళ్ల వల్లనే ఇమ్రాన్ ఖాన్ బదనం అయ్యాడని చెబుతున్నారు. పాక్ నుంచి అమ్మాయిలను చైనా వాళ్లు ఎత్తుకుపోతుంటే చేతకాని వాడి వలే చూస్తుండి పోయాడని పాక్ ప్రధాని వర్గం ఆరోపిస్తుంది.


ప్రస్తుతం చైనా నుంచి తెచ్చిన వాహనాలను, చైనా కు సంబంధించిన వస్తువులను  ధ్వంసం చేస్తున్నారు. ఖైబర్ పంక్తువా లో చైనా వారికి గనులు తవ్వుకోవడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అది నచ్చక ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించేలా అమెరికా ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమెరికా పన్నిన కుట్ర వల్లే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.


తర్వాతే షాబాద్ షరీఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనా ఎయిర్ క్రాఫ్ట్ ను మొయిన్ వ్యాలీలో ధ్వంసం చేశారు. చైనా తో అంటకాగిన పాక్ ఆర్మీకి సంబంధించిన సైనికుల ఇళ్లకు వెళ్లి మరీ దాడులు చేస్తున్నారు. దీన్ని వీడియో రూపంలో బయట పెడుతున్నారు. అంతే కాకుండా అవినీతి సొమ్ముతో పాక్ సైనికాధికారులు ఎంత లగ్జరీ లైఫ్ గడుపుతున్నారో చూస్తే అర్థమవుతుందని వీడియోలు తీసి మరీ ప్రపంచానికి చూపిస్తున్నారు.


ఎన్నడూ కూడా పాకిస్థాన్ సైన్యం మీద తిరుగుబాటు చేయని పాక్ ప్రజలు ఇప్పుడు చేస్తున్నారు. ఏకంగా పాక్ సైనికాధికారుల ఇళ్లనే టార్గెట్ చేసుకుని మరీ దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాక్ కు ఈ అల్లర్లు మరింత నష్టాల్లోకి నెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: