పార్టీ అధిష్టానం అర్జంటుగా మేల్కొనకపోతే కాంగ్రెస్ కు జనాలు మంగళంపాడేయటం ఖాయమని అర్ధమైపోయింది. ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా కాంగ్రెస్ పరిస్ధితి బాగుందనేందుకు లేకుండాపోయింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల క్రితమే నాశనమైపోయింది. అక్కడ ప్రాంతీయ పార్టీల తోకను పట్టుకుని ఏదో పదో లేకపోతే 20 సీట్లో అడుక్కుని పోటీచేసే స్ధాయికి పడిపోయింది. కాస్త కేరళలోనే అప్పుడప్పుడు అధికారంలోకి వస్తోంది. ఇపుడు కేరళలో కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఎందుకంటే రెండోసారి పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇక అస్సాంలో అయినా వస్తుందని అనుకుంటే అక్కడా అవకాశం పోయింది.
కాబట్టి కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందో లేదో తెలియాలంటే మరో ఐదేళ్ళు ఆగకతప్పదు. ఇక ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అయితే అధికారంలోకి రావటం కల్లే. అధికారంలో ఉన్నపుడు అవినీతి, అక్రమాలే కాకుండా గ్రూపు రాజకీయాలతో నేతల్లో ఎప్పుడూ గొడవలే. దీంతో జనాల్లో విసుగొచ్చేసి ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేసేశారు. అయినా వాళ్ళల్లో బుద్ధిరాలేదు. మధ్యప్రదేశ్ లో 15 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ కు జనాలు అధికారం కట్టబెడితే వర్గరాజకీయాలతో వాళ్ళంతట వాళ్ళే ప్రభుత్వాన్ని పడగొట్టేసుకున్నారు. నిజానికి నరేంద్రమోడి పరిపాలనపై జనాల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతోంది. అయితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేంత తీరిక, స్ధాయి కాంగ్రెస్ నేతల్లో కనబడటం లేదు.
రాహూల్ గాంధి ఇప్పటికీ పాలిటిక్స్ ను సీరియస్ గా తీసుకుంటున్నట్లు లేదు. అలాగే ప్రయాంకగాంధీ కూడా ఎప్పుడోసారి తళుక్కుమని మెరిసి మళ్ళీ మాయమైపోతున్నారు. ఇక సీనియర్లు పార్టీకి మోయలేని డెబ్ వెయిట్ గా మారిపోయి చాలా కాలమే అయ్యింది. వీళ్ళని వదలించుకోలేరు, కొత్తతరాన్ని ఆహ్వానించలేరు. దీని ఫలితంగా జనాలకు కాంగ్రెస్ నాయకత్వం మీద నమ్మకం పోతోంది. అందుకనే ఎక్కడికక్కడ జనాలు ప్రాంతీయ పార్టీలనే ఆధరిస్తున్నారు. పాలనలో ఎన్ని లోపాలున్నా, జనాల్లో ఎంత వ్యతిరేకతున్నా చివరకు మోడినే దక్కన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ ను ఆదరించటానికి జనాలు సిద్ధంగా ఉన్నా పార్టీయే అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా లేదు. అందుకనే నానాటికీ కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి