
తాజాగా హైదరాబాద్ నగరంలో పునరుద్దరించిన బన్సీలాల్ పేట్ మెట్ల బావిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చారిత్రాక కట్టడాలను పరీరక్షించడంతో భాగంగా కేటీఆర్ శిథిల భవణాలు, కట్టడాలను పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈ మెట్ల బావిని అభివృద్ధి చేశారు. మెట్ల బావికి నూతన సొబగులు అద్ది ప్రారంభించారు. బన్సీలాల్ పేట్ లోని ఈ పురాతనమైన మెట్ల బావి కోనేరు 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పు కలిగి ఉంది. మెట్లబావిలోతు 53 అడుగులు. ఇటీవలి కాలం వరకూ ఈ బావి పూర్తిగా చెత్త, వ్యర్దాలతో పూడుకుపోయింది.
దీన్ని సహిత స్వచ్చంద సంస్థ, జీహెచ్ఎంసీ 8 నెలల పాటు శ్రమించి 500 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాయి. ఆ తర్వాత మరమ్మతులు చేశారు. ఇప్పుడు రాత్రి సమయంలో లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో మెట్ల బావి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అసలు ఈ మెట్లబావి చరిత్ర ఏంటి.. నిన్న మొన్నటి వరకూ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో వివరించేలా ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అప్పటి ప్రజల అవసరాల కోసం 17 వ దశాబ్దంలో బన్సీలాల్ పేట లో ఈ మెట్ల బావిని నిర్మించినట్టు తెలుస్తోంది. మెట్ల బావి, నూతనంగా నిర్మించిన టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో ఏర్పాటు చేసిన మెట్ల బావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను, గార్డెన్ ను ఏర్పాటు చేశారు. నిజాం కాలంలో అప్పటి స్థానిక ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ బావిని నిర్మించారు. అప్పట్లో ఈ బావిని నాగన్న కుంటగా పిలిచే వారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు శభాష్ కేటీఆర్ అనాల్సిందే కదా!