అత్యంత ప్రమాదకరమైనటువంటి తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి) వరుస పెట్టి పాకిస్తాన్‌పై ఎటాక్స్ జరుపుతుంది. ఆ ఎటాక్స్ తో పాకిస్తాన్ సైన్యానికి ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటివరకు కోహిద్ ఏరియాలో కాన్వాయ్ ను టార్గెట్ చేస్తూ జరిగిన విధ్వంసంలో, అక్కడ జరిగిన దాడుల్లో ఒక కెప్టెన్ తో సహా 5మంది సైనికులు చనిపోయారు. అసలు ఏం చేయాలో తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో అక్కడ పాకిస్తాన్ సైన్యం ఉన్నారు.


2021 లో ఇస్లామాబాద్ లో జరిగిన సూసైడ్ ఎటాక్ బాంబర్ విధ్వంసం నుంచి పాకిస్థాన్లో ఈ విధంగా దాడులు మొదలయ్యాయి. టీటీపీ కార్యకలాపాలు క్రెప్టా నుంచి కాబూల్ వరకు కొనసాగాయి. కాల్పుల విరమణ ప్రకటించాక కూడా తెహ్రిక్ఈ తాలిబన్ పాకిస్తాన్ విధ్వంసాలు జరుపుతూనే ఉంది.ఇమ్రాన్ ఖాన్ టైంలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇప్పుడు షరీఫ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని పక్కనపెట్టి తిరిగి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇస్లామాబాద్ లో సూసైడ్ బాంబర్ చేసిన ఎటాక్ లో ఒకరు చనిపోతే ఎనిమిది మందికి గాయాలయ్యాయి.


సౌత్ వెస్ట్ లో రాయల్పిండి దగ్గర్లోని పాక్ ఆర్మీ చెక్ పాయింట్ దగ్గర మహిళా సూసైడ్ బాంబర్ చేసిన ఎటాక్ అప్పట్లో సంచలనం సృష్టించింది. కాల్ టాక్సీలో చేసినటువంటి విధ్వంసం మరో సంచలనానికి కేంద్రం అయింది. ఆగస్టులో రోడ్ సైడ్ బాంబులతో దెబ్బతీస్తే, టెన్త్ డిసెంబర్లో ఇస్లామాబాద్ లో గత ఏడాదిలో ఒక విధ్వంసం చేసింది. ఫిబ్రవరి 6న డ్యూరాండ్ దగ్గర ఐదుగురు సైనికులను చంపితే, ఫిబ్రవరి 22న గ్రైనేడ్ దాడితో నలుగురిని చంపింది.


23 మార్చిలో నార్త్ వజూరిస్థాన్ దగ్గర నలుగురు సైనికులు చనిపోయారు. అలాగే నమాలాలో స్కూల్ గర్ల్స్ వెళ్తున్న ఒక వ్యాన్ మీద కూడా  కాల్పులు జరిపారు. గతంలో పాకిస్తాన్ చంపిన అబ్దుల్ వలీ మరణానికి  ఈ విధ్వంసాలతో బదులిస్తున్నామని టీటీపి చెప్తుంది. మరి ఈ వరుస ఘటనలు పాక్, ఆఫ్ఘన్‌ మధ్య యుద్దానికి దారి తీస్తాయా?

మరింత సమాచారం తెలుసుకోండి: