2022లో ఏపీలో సైబర్ నేరాల సంఖ్య పెరిగిందని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి పేర్కొన్నారు. ఆన్ లైన్ లోజాబ్, లోన్ పేరుతో మోసాలుసామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా తిట్టుకోవడంలాంటి కేసు లు పెరిగాయని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి వెల్లడించారు. లోక్ అదాలత్ లో 57 వేల కేసులను పరిష్కరించామని డీజీపీ తెలిపారు. శిక్షల పడే శాతం ఈ ఏడాది పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేశామని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ ఏడాది  66.2 శాతం కన్విక్షన్ శాతం ఉందని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. మహిళలపై అత్యాచారాల, హత్య కేసులో 44 మందికి శిక్ష పడిందని 88.5 శాతం కేసుల్లో చార్జిషీట్లు వేశామని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగుని ఆపటానికి చర్యలు తీసుకున్నామని డీజీపీ వివరించారు.  2.45 లక్షల కేజీల గంజాయి సాగును దహనం చేశామని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి వెల్లడించారు. వేరే రాష్ట్రాల్లో కూడా గంజాయి సాగు అడ్డుకోవాల్సి ఉందని డీజీపీ తెలిపారు.


నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా గంజాయి సాగును దహనం చేశామన్న డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి.. గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సబ్సిడీ పై అందించామన్నారు. శాటిలైట్ ఫొటోస్ ద్వారా ఇంకా ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందేమో చూసి చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి స్పష్టం చేశారు. దిశ యాప్ ద్వారా వచ్చిన 25 వేల ఫిర్యాదుల్లో 1500 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశామని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి వివరించారు.  వీక్లీ ఆఫ్ కొంత వరకు పోలీసులకు ఇస్తున్నామన్న డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి 4 వీక్ ఆఫ్స్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: