
అయితే అక్కడ రెండు మూడు వందల సంవత్సరాలకు సరిపడా గ్యాస్, పెట్రోలు, డీజిల్, ఖనిజాలు, గనులు వంటి సహజ వనరులు ఉండడంతో అమెరికా, యూరప్ దేశాలు ఆ ప్రాంతంపై వాటా కావాలని కోరుకుంటున్నాయి. అయితే రష్యా అక్కడ యుద్ధ పనుల్లో నిమగ్నమై ఉందనుకుని అవి ఆ ప్రాంతాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నాయి. కానీ అక్కడ రష్యా ఒక పక్కన యుద్ధం చేస్తూనే, మరోపక్క ఆ ప్రాంతాన్ని కూడా పట్టులోకి తెచ్చుకుంటుంది.
అక్కడ టాప్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం మాస్కో సరికొత్త న్యూక్లియర్ బాలిస్టిక్ సబ్ మెరైన్ ను యుద్ద నిమిత్తం తరలించింది. రష్యన్ బోరి తరగతికి చెందిన వ్యూహాత్మక జలాంతర్గామి అధికారికంగా 2022లో రష్యా నౌకాదళంలోకి చేర్చబడింది. ఇంకా రష్యా దాని దగ్గర 16 అణ్వస్త్రాలతో కూడిన రష్యన్ బోలావా క్షిపణులను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి 1 కంటే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్లను మోయగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
2 రష్యన్ వ్యూహాత్మక బాంబర్లు కూడా ఆర్కిటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించాయి. అలా సహజంగా ఛేదించలేని ఆ మంచు ఖండాల ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా అణ్వాయుధాలను వదిలే సబ్మెరైన్లను ఇంకా యుద్ధ విమానాలను మోహరించి ప్రత్యర్థి దేశానికి తాను సంసిద్ధంగా ఉన్నట్టు సందేశాన్ని చాలా బలంగా పంపుతున్నాయి.