
ప్రస్తుతం బ్రిటన్ లో పెను సంక్షోభం మొదలైంది. ప్రపంచంలో 23 శాతం భూ భాగాన్ని తమ ఆదిపత్యంలో పెట్టుకున్న దేశం ప్రస్తుతం తిండి గింజలకు ఇబ్బందులు పడుతోంది. 1913 లో 412 మిలియన్ల ప్రజలను పాలించిన దేశం బ్రిటన్. కానీ ఇప్పుడు బ్రిటన్ లో ప్రూట్స్, వెజిటెబుల్స్ రేషన్ మీద ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. షాపుల్లో ఖాళీ షెల్ప్స్ కనిపిస్తున్నాయి. టామోటా, కుకుంబర్ లాంటివి మూడు యూనిట్లకు మించి కొనకూడదని చెబుతున్నారు.
యూరప్ లో తీవ్రమైన మంచు ప్రభావం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని ప్రతిదీ అచితూచి కొనుక్కోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కాస్ట్ ఆప్ లివింగ్ పెరిగిపోయింది. మూడు నెలలుగా బ్యాంకులు అన్నదానం లాంటి కార్యక్రమం చేపడుతున్నాయి. వీరు కూడా ఇంకా రెండు నెలల కంటే ఎక్కువ పెట్టలేని పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు.
అనేక చోట్ల పిల్లల తల్లిదండ్రులు స్కూల్స్ ని మానేపిస్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. అనేక చోట్ల మూడు పూటలకు బదులు ఒక పూట తింటున్నారని తెలుస్తోంది. సేవింగ్స్ అన్ని ఖర్చయిపోయాయి. 1956 తర్వాత ఆ స్థాయికి దిగజారిపోవడం ఇదే మొదటి సారి. ఒక్కొక్కరు ఒక్కో కారులో తిరిగే స్థాయి నుంచి నలుగురు కలిసి ఒక కారులో ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది. బ్రిటన్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, సమ్మెలు కొనసాగుతున్నాయి. మరి రారాజులా బతికి అన్ని దేశాలను పాలించినా తెల్ల జాతీయుల పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందంటే విధిరాత తప్పదేమో అనిపిస్తుంది.