
నల్లగొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినా మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాలకు దక్కేలా చూసానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. తాను మాట్లాడిన విషయాలు...కట్ చేసి, కొన్ని అంశాలను మాత్రమే లీక్ చేసారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రికార్డు పెట్టారని తనకు తెలుసని, పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి చెరకు సుధాకరు తనను తిడుతున్నాడని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.
చెరకు సుధాకర్ పై పీడీయాక్ట్ కేసు పెడితే..తానే కొట్లాడినట్లు,తనను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తనను సస్పెండ్ చేయాలని, దరిద్రులు అనడం వల్లనే బాధతో మాట్లాడినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.
నకిరేకల్ లో తనపై పోస్టర్ లు వేశారని..ఎవరు వేసారో తనకు తెలుసన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తమ వాళ్ళు చంపేస్తారేమోనని భయంతో మాత్రమే చెప్పినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తనపై చేసిన వాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రేకి ఫిర్యాదు చేషినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ఎంపీ వెంకట్ రెడ్డిని తిడితే నకిరేకల్ టికెట్ వస్తుందని అనుకుంటున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తనను వీడు ,వాడు అని తనను సంబోదించు వచ్చా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు .