
అవి తీవ్ర వాదుల చేతిలో ఉండటం కంటే రష్యాకు అప్పగిస్తే మంచిదంటూ ఉచిత సలహాలు ఇచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో పరిస్థితులు అస్సలు బాగోలేదు. ఈ సమయంలో సౌదీ అరేబియా పాక్ నుంచి అణ్వయుధాన్ని తీసుకుపోయినట్లు ప్రచారం జరిగింది.
కానీ చైనా మాత్రం తన అణ్వయుధాలను పాక్ లో దాచి ఉంచినట్లు వార్తలు బయటకు వచ్చాయి. పాకిస్థాన్ లో తెహ్రీక్ ఈ తాలిబాన్లు, బెలూచి రెబల్స్, సింధు రెబల్స్, ఐఎస్ ఐ అనే ఉగ్ర వాద సంస్థల నుంచి అణ్వయుధాలకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల వల్ల కావట్లేదు. సివిల్ వార్ నడుస్తుంది. దీంతో అమెరికా అక్కడన్న అణ్వయుధాలకు ముప్పు పొంచి ఉందని చెబుతోంది.
కానీ పాకిస్థాన్ సైన్యం వాటిని కాపాడగలుగుతుందని భావిస్తోంది. పాకిస్థాన్ సైన్యం బలంగానే ఉందని చెబుతున్నారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ వారు చెబుతున్నా విషయం ఏమిటంటే పాక్ లో ని సైన్యం అణ్వయుధాలను కాపాడగలుగుతుందని చెప్పారు. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా అణ్వస్త్రాల విషయంలో మాత్రం ఎక్కడా ఇబ్బంది ఉండకపోవచ్చని అన్నారు. వాటిని కాపాడే శక్తి సామర్థ్యాలు పాక్ సైన్యానికి ఉందని చెప్పారు. మొత్తం మీద ఉక్రెయిన్ లో అణ్వయుధాలు లేక యుద్ధంలో ఓడిపోతుంటే.. పాక్ లో ఉండి అవి తీవ్రవాదులకు పోతాయేయోనని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.