
దీనిపై ఇలా మాట్లాడుతున్న అమెరికా ఒక విషయంపై మాత్రం స్వేచ్ఛను ఎందుకు ఇవ్వలేక పోతుంది, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 35ఏ తీసేసాక మార్పులు, అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ప్రత్యక్ష పెట్టుబడులు ఎలా వచ్చాయి, ఉపాధి అవకాశాలు ఎలా పెరిగాయి, టూరిస్టులు ఎలా వచ్చారు, పరిస్థితులు ఎలా బాగుపడ్డాయి అనే దానిమీద అమెరికాలో ఒక సదస్సు జరుగుతుంది.
ఆ సదస్సు పైకి పాకిస్తాన్ అనుకూలురు వచ్చి దాడి చేసి ఆపితే వాళ్ళని ఆపినటువంటి పోలీసు యంత్రాంగం లేరు. అది అమెరికాలో ఉన్నటువంటి వన్ సైడ్ సపోర్ట్ అన్నమాట. అవసరమైనప్పుడు సాయం అందించడం అనేది. విదేశాలలో జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క ఆర్టికల్370 పరివర్తనపై జరిగిన ప్యానెల్ చర్చలో యు.ఎస్‌లోని పాకిస్తానీ పౌరులు విరుచుకుపడ్డారు.
వాషింగ్టన్‌లోని డీసీ ప్రెస్ క్లబ్లో కాశ్మీర్‌పై చర్చ జరిగింది మరియు దీనికి కాశ్మీర్ యొక్క ప్రో ఇండియా వాయిస్‌లు హాజరయ్యారు. కాశ్మీరీ మద్దతు దారులు అమెరికా వెళ్ళి మరి అక్కడ చర్చలు జరుపుతూ అక్కడున్న ప్రెస్ క్లబ్ లో కాశ్మీర్ ఎంత చక్కగా మారిపోయిందో తెలియజేస్తుండగా దీన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ నుంచి వచ్చిన విద్వేష దారులు దాడి చేసి ఆ కార్యక్రమాన్ని అంతా చెడగొట్టారని తెలుస్తుంది. ఇలాంటి విద్వేష దాడి ద్వారా, ఇలా జరుగుతున్న ఒక కార్యక్రమం మీద దాడి చేయడం ద్వారా కాశ్మీర్ యొక్క ప్రస్తుత స్వరూపాన్ని ప్రపంచానికి తెలియనివ్వకుండా చేశారు. అదే వాళ్ళ అసలు లక్ష్యం.