వైసీపీ నాయకులు, జగన్ మీద కానీ ఏమైనా చిన్న ఆరోపణలు వస్తే చాలు టీడీపీ అనుకూల పత్రికలు మొదటి పేజీలో బ్యానర్ ఐటంలు ఇస్తుంటాయి. చంద్రబాబు మీద ఎవరైనా అవినీతి ఆరోపణలు చేస్తే మాత్రం లోపల పేజీల్లో ఏదో మూలన సర్దేస్తుంటారు. ఇది పత్రికలు చదివే వాళ్లకి అందరికీ తెలిసిన విషయమే. షాపూర్ జీ, పల్లంజీ ముడుపుల కేసులో చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎక్కడో మూలన ఈ విషయాన్ని రాసుకొచ్చారు. దీనికి తోడు విశ్వసనీయతను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు.


చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు దూళిపల్ల నరేంద్ర, బొండా ఉమ ఇద్దరు ఆరోపించారు.  చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినపుడు రూ.2 వేల కోట్లు సీజ్ చేసినట్లు సాక్షి పత్రికలో రాశారన్నారు. కానీ అక్కడ కేవలం రూ.2.63 లక్షలు, మూడున్నర తులాల బంగారం మాత్రమే పట్టుకున్నట్లు ఐటీ శాఖ తెలిపిందన్నారు.  కేవలం రెండు లక్షలను మాత్రమే పట్టుకుంటే 2 వేల కోట్లు పట్టుకున్నట్లు ప్రచారం చేయడంలో జగన్ కు చెందిన పత్రికలకే సాధ్యమని విమర్శించారు.  


ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. 2021 మార్చి 31 నాటికి 11 లక్షలు మాత్రమే పీఏ శ్రీనివాస్ దగ్గర ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించిన వివరాల్లో ఉందని తెలిపింది. మనోజ్ వాసుదేవ్ అనే షాపూర్ జీ, పల్లం జీ అనే సంస్థలో గుమస్తా, అతనికి ఏవేవో లింకులు పెట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ చూపించిన లెక్కలకు, ఐటీ అధికారుల లెక్కలకు సంబంధించి రూ.3882 తేడా ఉంటే ఐటీ అధికారులు వెంటనే కట్టించుకున్నారు.


కానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు. ఏవైనా ఆధారాలు ఉంటే నిరూపించాలి. కానీ ఇష్టమొచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మీరు మీ సాక్షి పత్రికలో రాస్తూ ప్రజల్ని మోసం చేయాలనుకోవడం సరైంది కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: