వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే కోరుకుంటుంది. కానీ చైనా వుహన్ పరిసరాలకు కూడా ప్రపంచ దేశాల్లోని మేధావులను, శాస్త్రవేత్తలను రానీయడం లేదు. ఎందుకంటే చైనా వుహన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ లీకైందని అనుమానం. వుహన్ ల్యాబ్ లో లీకైనట్లు అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. గతంలో ఆ ల్యాబ్ లో పనిచేసే అమెరికా శాస్త్రవేత కూడా అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఎక్కడ పొరపాటు జరిగింది. ఏ విధంగా లీకైంది. దీనికి స్పైక్ ప్రోటీన్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయి. మళ్లీ మళ్లీ కొత్త రూపం ఎందుకు సంతరించుకుంటోంది. దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలంటే ఏం చేయాలి. ఎలాంటి మందులను కనుక్కోవాలి. తదితర వివరాలు తెలుసుకోవాలంటే వుహాన్ ల్యాబ్ లో అడుగుపెట్టాల్సిందే. కానీ చైనా దీనికి ససేమిరా అంటోంది. చైనా ఒప్పుకుంటే కరోనా మళ్లీ రాకుండాా శాశ్వతంగా మందులు కనిపెట్టొచ్చు. ఎవరైనా సరే అక్కడికి వెళతానంటే మాత్రం డ్రాగన్ కంట్రీ ఒప్పుకోవడం లేదు.
అంటే వుహన్ ల్యాబ్ లో కరోనా వైరస్ కాకుండా ఇంకా ప్రమాదకరమైన వైరస్ లను ఏమైనా చైనా కనిపెడుతుందా.. దీని వల్ల ఏదైనా ప్రపంచానికి తెలిస్తే ప్రమాదమని భావిస్తుందా.. ఇలా అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికంగా, సామాజికంగా కుదేలైపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రపంచమే స్తంభించిపోయింది. అయినా చైనా అక్కడ పరీక్షలకు ఒప్పుకోవడం లేదంటే ఆ ల్యాబ్ లో అంతకుమించి రహస్యం ఏదో దాగుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి