మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశం ఉందా? చాలా మంది ప్రపంచ మేధావులు అవుననే అంటున్నారు. ఇన్ని రోజులుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాల పరంగా సాయం చేస్తూ వస్తూనే ఉంది. ఉక్రెయిన్ యుద్దంలో ఇన్ని రోజులుగా అడుగుతున్న ఎప్ 16 విమానాలను అమెరికా ఇవ్వలేదు. కానీ జీ7 దేశాల సమావేశాల అనంతరం అమెరికా ఇవ్వకుండా నాటో దేశాలు ఇచ్చేలా చేస్తోంది.


ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు ఎప్ 16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్ ఇవ్వాలని గట్టిగా పట్టు బడుతోంది. కానీ వాటితో రష్యా లోపలికి వెళ్లి మాత్రం యుద్దం చేయొద్దని సూచిస్తోంది. కానీ మొన్నటి వరకు ఇచ్చిన నార్మల్ యుద్ద విమానాలతోనే రష్యా లోపలికి వెళ్లి యుద్దం చేసింది ఉక్రెయిన్. ఇప్పుడు అధునాతన ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయకుండా ఊరుకుంటుందా? రష్యా వద్ద కూడా సుఖోయ్ 35 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటి ద్వారా యుద్ధం చేయడం రష్యాకు అత్యంత సులభం.



అయితే ఎఫ్‌ 16 యుద్ధ విమానాలతో నాటో దేశాలు, అమెరికా, రష్యా పై విరుచుకపడాలని చూస్తే రష్యా ఓడిపోయే పరిస్థితి వస్తే మాత్రం ఎక్కడా తగ్గదు. తన వద్ద ఉన్న అణ్వస్త్రాలను బయటకు తీస్తుంది. నాటో దేశాలపై ఉక్రెయిన్ పై విచ్చల విడిగా అణ్వస్త్రాలను ప్రయోగిస్తుంది. దీని వల్ల నాటో దేశాలు కూడా తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలను తీసి యుద్ధం చేయడానికి ప్రయత్నాలు చేస్తాయి.


దీంతో మూడో ప్రపంచ అణు యుద్ధం వచ్చి ప్రపంచం సర్వ నాశనం అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా ప్రపంచ దేశాలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎవరూ రష్యాను, ఉక్రెయిన్ ను ఒప్పించలేకపోతున్నారు. దీని ఫలితం రాబోయే రోజుల్లో ప్రతి దేశంపై పడే అవకాశం ఉంటుంది. అణ్వస్త్రాల దాడి వల్ల గాలి కలుషితమై, రేడియేషన్ ప్రభావంతో మనుషులు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: