పాకిస్తాన్ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేదు. మొన్న మన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్లడం అసలు మొదట పాకిస్తాన్ కి నచ్చని విషయం. అక్కడ ఆయనకి రాచ మర్యాదలు దక్కడం, ఇంకా అక్కడ భారతదేశం అమెరికాతో చేసుకున్న ఒప్పందాలు ఇవన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ కు కంటగింపుగా ఉన్నాయి. పాకిస్తాన్ ఇంకా భారతదేశ వేర్పాటు చెంది 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా పాకిస్తాన్ తన ప్రవర్తనని మార్చుకోలేదు.


పైగా భారతదేశంపై ఏ నిమిషంలో, ఏ వైపు నుండి విషం చిమ్ముదామా అనే చూస్తూ ఉంటుంది. ఇప్పటివరకు, ఇప్పుడు కూడా అమెరికా చెప్పుచేతల్లోనే నడిచింది, నడుస్తుంది పాకిస్తాన్. రష్యా దగ్గర ఆయుధాలు ఇంకా ఆయిల్  కొంటూ ఉంటుంది భారతదేశం. అలాగే అమెరికా దగ్గర కూడా ఆయిల్ కొంటూ ఉంటుంది. ఇంకా యూరప్ దేశాల్లో కూడా ఈ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు చేస్తూ ఉంటుంది.


ఎవరితోనూ శత్రుత్వం లేకుండా, అలాగని మిత్రుత్వం అని కూడా కాకుండా ఒక న్యూట్రల్ పద్ధతిలో సాగుతూ ఉంటుంది భారతదేశం. మమ్మల్ని మీరు దూరం చేసుకోవడం మీ కర్మ, ఇంకా మా కర్మ అంటూ ఒక పక్కన అమెరికాని తిట్టుపోస్తూనే మరో పక్కన తనలో తాను నలిగిపోతుందట పాకిస్తాన్. అమెరికా, భారత్‌ల మధ్య కుదిరిన  ఒప్పందాలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.


భారతదేశానికి అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ఈ ప్రాంతంలో సైనిక అసమతుల్యత ఇంకా వ్యూహాత్మక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి.  ఇలాంటి విషయాల్లో ఏకపక్ష వైఖరితో అప్రమత్తంగా ఉండాలని పాక్ అమెరికాకు పిలుపునిచ్చింది. భారతదేశంలో చిప్ ఇండస్ట్రీల నడపడంతో పాటుగా ఆయుధాలను కూడా అమ్మే విధంగా ప్లాన్ చేస్తున్నారని, అది ఆసియా ఖండానికే మంచిది కాదన్నట్లుగా పాకిస్తాన్ చెప్పుకొస్తుంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: