చైనాతో అమెరికా కావాలనే విభేదాలు పెట్టుకోవాలని చూస్తుందని జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు. మేం అమెరికాతో కలిసి ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కానీ అదే కావాలని రెచ్చగొట్టే పనులు చేస్తుందని ఆరోపించారు. వాణిజ్య విషయాల నుంచి ప్రతి దాంట్లో ఉప్పు నిప్పుగా ఉన్న చైనా, అమెరికా మధ్య బంధం ప్రస్తుతం బలపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని గురించి అమెరికా దౌత్య బృందం సభ్యుడు హెన్రిక్ రంగంలోకి దిగాడు.


50 ఏళ్ల కిందట క్యాప్టలిస్ట్ అమెరికా, కమ్యూనిస్టు చైనా ల మధ్య మైత్రి కుదిర్చిన హెన్రిక్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఆయనకు ఇప్పుడు వందేళ్లు ఉన్నాయి. అమెరికా విదేశాంగ మంత్రిగా పని చేశారు. అయితే మొన్నటి వరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనాలో పర్యటించారు. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఆయనను కలవాలని అనుకోలేదు. దానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఎలాంటి అధికార హోదా లేనటువంటి హెన్రిక్ కిసింజర్ ను మాత్రం  జిన్ పింగ్ కలిశారు. దీని వెనక అమెరికా చైనా పట్ల ప్రవర్తిస్తున్న తీరు ను ఎండగట్టారని చెప్పినట్లు సమాచారం.


దైపాక్షిక సంబంధాలు బలపడేలా చేయాలని ఆయన్ని కోరినట్లు తెలుస్తోంది. 1970 లో అమెరికా జాతీయ భద్రత విభాగంలో కిసింజర్ పని చేశారు. చైనాలో సంబంధాలు పెంచుకునేందుకు 1970 లో చైనా వచ్చాడు. అయితే తదనంతరం అమెరికా అధ్యక్షుడు చైనా లో పర్యటించడం ఆ తర్వాత వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. కానీ కిసింజర్ దీన్ని రాజకీయ పర్యటనగా చూడొద్దని వ్యక్తిగత పర్యటన అని అన్నారు.


ఆయన పర్యటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. తైవాన్ వ్యవహారంలో అమెరికా ప్రవర్తిస్తున్న తీరు, సెమి కండక్టర్ చిప్ లలో రా మెటిరీయల్ ను ఆపేయడం లాంటి విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అమెరికా, చైనాలను కలపాలనే ప్రయత్నం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: