మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ఈ సంవత్సరం డిసెంబర్ లో జరగనున్నాయి. అయితే మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోనే ఓటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ తర్వాత బీజేపీ అధికారాన్ని ఎమ్మెల్యేల ఫిరాయింపుతో తీసుకుంది. దీంతో అక్కడ వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


గ్రూపుల మధ్య తగాదాలు, ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. అయితే ఛత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్ దిగిపోయాక బీజేపీ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. తెలంగాణ లో బీఆర్ఎస్ కు ప్రస్తుతం పట్టున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ దూకుడు పెంచింది. కానీ బీజేపీ అధ్యక్షుడికి మార్చుకుని సొంత పార్టీ నేతలతోనే ఇబ్బంది పడేలా చేసుకుంటుంది. ఈ సమయంలో తెలంగాణలో బీజేపీ గెలవడం అనేది కష్టమనే భావన కనిపిస్తోంది.


రాజస్థాన్ లో మాత్రం కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బీజేపీకి కలిసొచ్చేలా ఉన్నాయి. దీన్ని బీజేపీ రెండు చేతులా అందిపుచ్చుకుంటోంది. కాంగ్రెస్ శాసన సభ్యుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయగా.. బీజేపీ శాసన సభ్యులు కూడా అతనికి తోడుగా నిల్చుని మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలు బయట పడగా.. బీజేపీ దాన్ని ఒడిసి పట్టుకుంటోంది. అసెంబ్లీలో సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గాను కాంగ్రెస్ మంత్రి రాజేంద్ర తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.


అసెంబ్లీలో రాజేంద్ర అనే మంత్రి కాంగ్రెస్ నాయకుల అవినీతి చిట్టా తన వద్ద ఉందని ఎర్ర డైరీ చూపిస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకుపోయారు. దీంతో మంత్రి వద్దకు కాంగ్రెస్ పక్ష శాసన సభ్యులు రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో రాజేంద్రను మార్షల్స్ సభ బయటకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి సొంత శాసన సభ్యుడే ఇలా చేయడంతో అంతర్గత కుమ్ములాట బయటకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP