ఉగాది అనగానే మన ఠక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. దీంతో పాటు మరో ఆసక్తికర అంశం పంచాంగ శ్రవణం. దీనిని చెవులు అప్పగించి మరీ వింటుంటాం. ఈ ఏడాది మన ఆదాయ, వ్యయాల గురించి.. మంచి చెడుల గురించి తెలుసుకోవాలనుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు నామ సంవత్సరం నడుస్తోంది. దీంతో శ్రీ క్రోధి నామ సంవత్సరం  ఏ పార్టీకి రాజయోగం కలుగ జేస్తోందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అయితే ఈ సారి ఆంధ్రా జ్యోతిష్యులకు ఈ ఉగాది పెద్ద పరీక్షగా నిలవనుంది. ఎందుకంటే మేలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ నాయకులంతా ఉగాది రోజున కుటుంబ సమేతంగా వేద పండితుల ఎదుట పంచాగాన్ని చెప్పించుకుంటారు. తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వారు రాజకీయ నాయకులకు ఏం చెబుతారో మనం ఊహిస్తే..


ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. రాష్ట్రం ఇప్పటి వరకు ఉన్న సంక్లిష్టత నుంచి బయట పడబోతోంది. అధికారం మారబోతుంది. మీకంతా మంచే జరుగుతుంది. మీకు తిరుగులేదు. మీ హయాంలో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అని చెబుతారు కావొచ్చు. ఇక పవన్ గురించి రాష్ట్ర రాజకీయాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తారు. అధికారంలో మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పుల్లో మీరు కీలక భూమిక వహిస్తారు. రాబోయే రోజుల్లో మీరే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు అని సెలవిచ్చుకుంటారు.


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. ప్రజాధారణతో మళ్లీ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. మీ పాలనకు తిరుగులేదు. మీ విజయం ఖాయం అని చెబుతారు అని మనం భావించవచ్చు. ప్రస్తుతం పంచాగ కర్తలు రాజకీయ నాయకుల గురించి పాజిటివ్ గా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. కిందటి సారి ఉగాది సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మీరే మళ్లీ సీఎంగా ఉంటారు అని చెప్పడం మనం గమనించాం. మరి ఈసారి వీరంతా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారా.. లేక వ్యక్తిపూజ చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: