తోటి మహిళా పోలీసులపైనే అకృత్యాలకు పాల్పడిన కాళేశ్వరం ఎస్.ఐ భవాని సేన్ శాశ్వతంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆయన్ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తున్నట్టు మల్టీజోన్ I ఐజిపి  శ్రీ ఏవి రంగనాథ్ తెలిపారు. మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ  ఏ. వి.రంగనాథ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.


కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణ లో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు  ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇతనిపై ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.


సదరు ఎస్. ఐ తన హోదా అడ్డుపెట్టుకొని  మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో పాటు ఎస్. ఐ తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంది. ఎస్. ఐ పై  ఈ పరిస్థితుల్లో విచారణ  చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం  సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా  మల్టీ జోన్ I ఐ జి పి శ్రీ ఏ. వి. రంగనాథ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: