- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ప్ర‌తినిధి )

రాజ‌కీయాల్లో వ‌చ్చారంటే.. వివాదాలు కామ‌న్‌. వివాద ర‌హితంగా ఉండాల‌ని అనుకున్నా.. నాయ‌కుల‌కు ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎక్క‌డో ఒక చోట వివాదాలు తెర‌మీదికి వ‌స్తూనే ఉంటాయి. అయితే.. ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా.. అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్నారు గుంటూరు జిల్లాలోని పెద‌కూరపాడు ఎమ్మెల్యే  భాష్యం ప్ర‌వీణ్‌. మంత్రి నారా లోకేష్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్న భాష్యం.. రాజ‌కీయంగా కూడా.. అంతే పేరు తెచ్చుకుంటున్నారు.


వాస్త‌వానికి పెద‌కూర‌పాడు ఎమ్మెల్యే టికెట్ ప్ర‌స్తుత పల్నాడు జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ కురావాల్సి వుంది. ఆయ‌న గ‌తంలోనూ అక్క‌డ వ‌రుస‌గా రెండుసార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ యువ‌త‌ను ఎంక‌రేజ్ చేయాల‌న్న‌ ఉద్దేశంతో నారా లోకేష్ సూచ‌నల మేర‌కు భాష్యం ప్ర‌వీణ్‌కు చంద్ర‌బాబు ఈ టికెట్ కేటాయించారు. వాస్త‌వానికి ఇలా త్యాగాలు చేసిన నియోజ‌క‌వ‌ర్గా ల్లో మాజీల‌కు.. ప్ర‌స్తుతం ఉన్న‌వారికి మ‌ధ్య వివాదాలు తార స్థాయిలో రేగుతున్నాయి. త‌మ మాటే నెగ్గాలని.. ఎమ్మెల్యేలు.. కాదు.. తాము త్యాగాలు చేయ‌డం వ‌ల్లే.. మీరు గెలిచార‌ని.. కాబ‌ట్టి త‌మ‌మాటే నెగ్గాల‌ని కొంద‌రు నాయ‌కులు ప‌ట్టుబ‌డుతున్నారు.


అయితే.. పెద‌కూర‌పాడులో మాత్రం ఈత‌ర‌హా వివాదాల‌కు అవ‌కాశం లేకుండా.. రాకుండా కూడా.. ఎమ్మెల్యే భాష్యం ప్ర‌వీణ్‌.. చ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటిని కూడా సంప్ర‌దించి.. ముందుకు సాగుతున్నారు. ఇక‌, నారా లోకేష్ మాటంటే భాష్యానికి వేదంతో స‌మాన మన్న మాట ఉంది. ఇప్ప‌టికీ ఆయ‌న ఆ పంథానే అనుస‌రిస్తున్నారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు పెద్ద పీట వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వివాదాల‌కు తావులేకుండా ముందుకు సాగుతున్నారు.


అయితే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల విష‌యంలో ప‌రిష్క‌రించాల్సిన‌వి చాలానే ఉన్నాయ‌ని.. తెలుస్తోంది. ఈ విష‌యంపై కూడా.. భాష్యం దృష్టి పెట్టారు. ప్ర‌స్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ర‌హ‌దారుల నిర్మాణం జ‌రుగుతున్న క్ర‌మంలో వాటిని పూర్తి చేసిన త‌ర్వాత‌.. డంపింగ్ యార్డులు.. వ్య‌క్తిగ‌త‌మ‌రుగు దొడ్లు.. జ‌ల‌జీవ‌న్ మిష‌న్ ద్వారా.. ఇంటింటికీ తాగునీటిని అందించాల‌ని బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌ను భాష్యం సిద్ధం చేసుకున్నారు. ఏదేమైనా.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాదిరిగా వివాదాల‌కు దూరంగా ఉండ‌డం భాష్యం రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను స‌మున్న‌తంగా నిలుపుతుండ‌డం గ‌మ‌నార్హం.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

నోట్ : వ్య‌క్తిగ‌త, కుటుంబ స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: