రాజకీయాలు సాధారణంగా ప‌వ‌ర్‌, అధికారం చుట్టూ తిరుగుతాయి. కానీ అది కుటుంబాల్లోకి చొరబడితే అత్యంత క్లిష్ట‌ రూపం దాలుస్తుంది. అన్నదమ్ములు, తోబుట్టువులు శత్రువులుగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విరోధాల మూలం ఒకరే పెత్తనం చేయాలని అనుకోవడం, ఇతరుల పాత్రను నిర్లక్ష్యం చేయడం. కుటుంబ పెద్ద కూడా నిస్సహాయుడిగా మారితే, న్యాయం చేయలేని స్థితిలో ఉంటే, ఈ చీలికలు మరింత పెద్ద‌వి అవుతాయి. ఇప్పుడు తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కుటుంబం ఈ సత్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు.
బీఆర్ఎస్ పార్టీ స్థాపన నుంచి దశాబ్దం పాటు కేసీఆర్ మాటే చట్టంగా నిలిచింది. కుటుంబంలోనూ, పార్టీలోనూ ఆయనకు ఎదురే ఉండేది కాదు. కానీ కవితపై వివక్ష, అవమానం చోటు చేసుకోవడంతో పరిస్థితి మారింది. కవిత తనను పూర్తిగా పక్కన పెడుతున్నార‌న్న అనుమానాల‌తో తిరుగుబాటు ప్రకటించారు. తండ్రి వద్ద న్యాయం కోరినా ఆయన నిశ్శబ్దంగా ఉండటమే ఆమె నిరాశకు కారణమైంది. చివరకు పార్టీ నుంచి సస్పెన్షన్ వరకూ వెళ్లింది.

ఇది కేవలం కవితకే కాకుండా కల్వకుంట్ల కుటుంబానికే భారీ దెబ్బ. హరీష్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు, వారిపై ఉన్న అనుమానాలు భవిష్యత్తులో వారికి అగ్నిపరీక్ష తప్పనిసరి చేస్తాయి. బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలు బయటకు రావడం కవిత నిర్ణయం వల్లే స్పీడ‌ప్ అయ్యింది. అస‌లు హ‌రీష్‌రావు, కేటీఆర్ మ‌ధ్య ఆ ఫ్యామిలీలో గ్యాప్ వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఇప్పుడు క‌విత ఆ గ్యాప్ తీసుకువ‌చ్చేశారు. ఇలాంటి పరిస్థితి గతంలో వైఎస్ కుటుంబంలోనూ జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు కుటుంబం ఏకతాటిపైనే ఉండేది. ఆయన అందరికీ పాత్రలు ఇచ్చి సంతృప్తి పరిచేవారు. కానీ ఆయన మరణానంతరం, జగన్ నాయకత్వం తీసుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. తల్లి విజయమ్మను సానుభూతి కోసం రాజకీయాల్లోకి తీసుకువచ్చినా, చివరికి ఆమెలో విలువ చూడలేదు. విజయమ్మను ఓడిపోయే స్థానం నుంచి పోటీ చేయించడం, చెల్లి షర్మిలను ఆస్తుల విషయంలో అన్యాయం జ‌రిగింద‌న్న చ‌ర్చ‌లు... ఆ కుటుంబంలో విభేదాలను మరింత పెంచాయి.

షర్మిల చివరికి మరో దారి లేక రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. విజయమ్మ కూడా కుమారుడి నుంచి దూరమై కుమార్తెతోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఆ కుటుంబం శాశ్వతంగా చీలిపోయింది. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఈ రెండు ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలు ఇప్పుడు చిన్నాభిన్నమైపోయాయి. కవిత తిరుగుబాటు, వైఎస్ కుటుంబంలో జరిగిన చీలికలు, రాజకీయాలు కుటుంబ బంధాలను కూడా ఎలా కరగదీస్తాయో చెప్పేందుకు నిద‌ర్శ‌నాలురాజకీయాలు సాధారణంగా ప‌వ‌ర్‌, అధికారం చుట్టూ తిరుగుతాయి. కానీ అది కుటుంబాల్లోకి చొరబడితే అత్యంత క్లిష్ట‌ రూపం దాలుస్తుంది. అన్నదమ్ములు, తోబుట్టువులు శత్రువులుగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విరోధాల మూలం ఒకరే పెత్తనం చేయాలని అనుకోవడం, ఇతరుల పాత్రను నిర్లక్ష్యం చేయడం. కుటుంబ పెద్ద కూడా నిస్సహాయుడిగా మారితే, న్యాయం చేయలేని స్థితిలో ఉంటే, ఈ చీలికలు మరింత పెద్ద‌వి అవుతాయి. ఇప్పుడు తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కుటుంబం ఈ సత్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు.
బీఆర్ఎస్ పార్టీ స్థాపన నుంచి దశాబ్దం పాటు కేసీఆర్ మాటే చట్టంగా నిలిచింది. కుటుంబంలోనూ, పార్టీలోనూ ఆయనకు ఎదురే ఉండేది కాదు. కానీ కవితపై వివక్ష, అవమానం చోటు చేసుకోవడంతో పరిస్థితి మారింది. కవిత తనను పూర్తిగా పక్కన పెడుతున్నార‌న్న అనుమానాల‌తో తిరుగుబాటు ప్రకటించారు. తండ్రి వద్ద న్యాయం కోరినా ఆయన నిశ్శబ్దంగా ఉండటమే ఆమె నిరాశకు కారణమైంది. చివరకు పార్టీ నుంచి సస్పెన్షన్ వరకూ వెళ్లింది.

ఇది కేవలం కవితకే కాకుండా కల్వకుంట్ల కుటుంబానికే భారీ దెబ్బ. హరీష్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు, వారిపై ఉన్న అనుమానాలు భవిష్యత్తులో వారికి అగ్నిపరీక్ష తప్పనిసరి చేస్తాయి. బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలు బయటకు రావడం కవిత నిర్ణయం వల్లే స్పీడ‌ప్ అయ్యింది. అస‌లు హ‌రీష్‌రావు, కేటీఆర్ మ‌ధ్య ఆ ఫ్యామిలీలో గ్యాప్ వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఇప్పుడు క‌విత ఆ గ్యాప్ తీసుకువ‌చ్చేశారు. ఇలాంటి పరిస్థితి గతంలో వైఎస్ కుటుంబంలోనూ జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు కుటుంబం ఏకతాటిపైనే ఉండేది. ఆయన అందరికీ పాత్రలు ఇచ్చి సంతృప్తి పరిచేవారు. కానీ ఆయన మరణానంతరం, జగన్ నాయకత్వం తీసుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. తల్లి విజయమ్మను సానుభూతి కోసం రాజకీయాల్లోకి తీసుకువచ్చినా, చివరికి ఆమెలో విలువ చూడలేదు. విజయమ్మను ఓడిపోయే స్థానం నుంచి పోటీ చేయించడం, చెల్లి షర్మిలను ఆస్తుల విషయంలో అన్యాయం జ‌రిగింద‌న్న చ‌ర్చ‌లు... ఆ కుటుంబంలో విభేదాలను మరింత పెంచాయి.

షర్మిల చివరికి మరో దారి లేక రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. విజయమ్మ కూడా కుమారుడి నుంచి దూరమై కుమార్తెతోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఆ కుటుంబం శాశ్వతంగా చీలిపోయింది. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఈ రెండు ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలు ఇప్పుడు చిన్నాభిన్నమైపోయాయి. కవిత తిరుగుబాటు, వైఎస్ కుటుంబంలో జరిగిన చీలికలు, రాజకీయాలు కుటుంబ బంధాలను కూడా ఎలా కరగదీస్తాయో చెప్పేందుకు నిద‌ర్శ‌నాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: