
ఈ పోస్టు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శలకు ప్రతిస్పందనగా వచ్చింది. ఖర్గే ఆంధ్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్ల సబ్సిడీలు ఇచ్చి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఈ పోస్టు ద్వారా లోకేష్ బెంగళూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపాలను, పోట్‌హోల్స్, పవర్‌కట్స్‌ను ఉద్దేశించి వ్యంగ్యం చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య పోటీ మరింత ఊపందుకుంది. ఈ పోస్టు వైరల్ అవ్వడంతో నెటిజన్లు రెండు వైపులా స్పందించారు.
కొందరు ఆంధ్ర ఆర్థిక పునరుద్ధరణకు ఇది సానుకూల సంకేతంగా చూశారు. అయితే చాలామంది ఈ రకమైన వ్యంగ్యాలు రాష్ట్రాల మధ్య సహకారాన్ని దెబ్బతీస్తాయని విమర్శించారు.లోకేష్ పోస్టు వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖర్గే స్పందిస్తూ "స్పైస్ ఆస్వాదించడం మంచిది కానీ బాలెన్స్‌డ్ బడ్జెట్ అవసరం" అని పేర్కొని ఆంధ్ర ఆర్థిక భారాన్ని ఎత్తి చూపారు.
ఈ మధ్య నెటిజన్ల స్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. చాలామంది లోకేష్ పోస్టును "అరోగెన్స్"గా అభివర్ణించి, రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలి కానీ అవమానించ కూడదన్నారు.ఒక నెటిజన్ "ఈ స్పైసీ తగ్గించుకుంటే మంచిది. ఐటీ సెక్టార్‌కు సహకారం కావాలి, ఫైట్ కాదు" అని పోస్ట్ చేశారు. ఈ స్పందనలు రాజకీయ నాయకులు సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించాలనే సామాజిక సందేశాన్ని ఇస్తున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు