
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు హామీలు ఆలస్యం, అవినీతి ఆరోపణలు, హైడ్రా డిమాలిషన్‌లు ప్రజలలో అసహనాన్ని రేకెత్తించాయి. జూబ్లీహిల్స్‌లో ఓటమి అంటే హైదరాబాద్ షిఫ్ట్‌లో కాంగ్రెస్ బలహీనతను బయటపెడుతుంది. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక పోరాటంగా చూస్తున్న ఈ స్థానం చేజారితే, పార్టీలో అంతర్గత విమర్శలు పెరుగుతాయి.
ముఖ్యంగా ఈ ఓటమి ప్రభుత్వ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.రేవంత్ రెడ్డి వ్యక్తిగత భవిష్యత్తుపై ఈ ఓటమి తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి పదవికి వచ్చిన తర్వాత మొదటి పెద్ద పరీక్షగా ఈ ఎన్నిక ఉంది. గెలిచినా రాజకీయ ఇమేజ్ బలపడుతుంది కానీ, ఓడిపోతే వోట్ క్యాచర్ ఇమేజ్ దెబ్బతింటుంది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ ఓటమిని రేవంత్ వైఫల్యంగా ప్రచారం చేస్తారు. పార్టీ అంతర్గతంలో కూడా ఆయన నిర్ణయాలపై ప్రశ్నలు ఎదురవుతాయి.
హైకమాండ్‌కు దూరంగా ఉన్నట్టు ఆరోపణలు పెరిగి, నాయకత్వ మార్పు చర్చలు మొదలవుతాయి. రేవంత్ రెడ్డి ఆర్థిక సంక్షోభం, అవినీతి ఆరోపణల మధ్య తన ఇమేజ్‌ను కాపాడుకోవాలంటే ఈ ఎన్నికలో విజయం అవసరం. ఓటమి ఆయన రాజకీయ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఓటమి తెలంగాణ రాజకీయాల్లో మలుపు తీస్తుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు