హరీష్ రావు పై అద్దంకి దయాకర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ధనాన్ని ముంచేసిన వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ శాఖల్లోనే ఎంతటి అవినీతి జరిగిందో ప్రజలకు బాగా తెలుసని గుర్తు చేశారు. భూములు ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన ఘనత మీదే అని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎన్ని ఇళ్లు కట్టారో ప్రశ్నించారు.మా మంత్రుల గురించి మాట్లాడే అధికారం మీకు ఎక్కడ ఉందని దయాకర్ నిలదీశారు.

మీ అవినీతిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోరని హెచ్చరించారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరని స్పష్టం చేశారు. మీ డబ్బా మీరే కొట్టుకుంటున్నారు తప్ప ఎవరూ మీ గురించి చర్చించడం లేదని ఎద్దేవా చేశారు.కేసీఆర్ బయటకు వచ్చి తన కూతురు కవితను ఎందుకు జైలుకు పంపారో ఒక్క మాట స్టేట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ సవాల్ విసిరింది. ఈ విషయంపై కేసీఆర్ నోరు మెదపకపోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.

బీఆర్ఎస్ నాయకులు ఇతరులపై ఆరోపణలు చేస్తూ తమ బండారాన్ని దాచుకుంటున్నారని దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కిందపడినా పై చేయి తమదే అనుకుంటూ బీఆర్ఎస్ నాయకులు బ్రమలో ఉన్నారని దయాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గుర్తు చేశారు. రాజకీయంగా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు రాష్ట్రంలో హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ ఈ అంశాలతో బీఆర్ఎస్ ను మరింత ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: