మంత్రి నారా లోకేష్‌కు సీఎం చంద్ర‌బాబు నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. `లోకేష్ సూప‌ర్‌గా స్పందించా రు` అని అనంత‌పురం జిల్లా కాల్వ బుగ్గ‌లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు వ‌స్తూ వ‌స్తూ.. అక్క‌డి నాయ‌కుల‌తో చెప్పిన మాట ఇది. దీనికి కార‌ణం.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌, దీనికి ముందు చోటు చేసుకున్న ప‌రిణామాల విష‌యంపై మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరేన‌ని స్ప‌ష్టం  అవుతోంది. వాస్త‌వానికి శ‌నివారం ఉద‌యం ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు నారా లోకేష్ హైద‌రాబాద్‌లో ఉన్నారు.
 

పైగా.. ఉత్త‌రాంధ్ర‌లో చాలా మంది సీనియ‌ర్ నాయ‌కులు ఉన్న నేప‌థ్యంలో వారికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. బాగుంటుంద‌న్న సూచ‌న‌లు వ‌చ్చాయి. కానీ, ఎందుకైనా మంచిద‌ని సీఎం చంద్ర‌బాబు.,. హైద‌రాబాద్‌లో ఉన్న నారా లోకేష్‌కు ఫోన్ చేసి.. `అక్క‌డి విష‌యాలు చూడు` అని సూచించారు. నిజానికి శ‌నివారం వ‌రకు గ‌త 20 రోజులుగా నారా లోకేష్ ఇంటిముఖం చూడ‌లేదు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌.. అనంత‌రం.. ఏపీలో వచ్చిన తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల‌తో ఆయ‌న బిజీ అయ్యారు.

 

దీంతో శ‌నివారం, ఆదివారం కుటుంబంతో గ‌డ‌పాలని వెళ్లారు. కానీ.. ఇంతలోనే.. శ్రీకాకుళం ఘ‌ట‌న జ‌రి గింది. దీనిపై ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని మాత్ర‌మే చంద్ర‌బాబు నుంచి సూచ‌న వెళ్లింది. కానీ, నారా లోక‌ష్‌.. చంద్ర‌బాబు ఫోన్‌తో రంగంలోకి దిగిపోయారు. నేరుగా క్షేత్ర‌స్థాయికి వ‌చ్చారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శిం చారు. ఆసుప‌త్రికి వెళ్లారు. రెండు మూడు గంట‌లు అక్క‌డే ఉన్నారు. వారి కి మెరుగైన వైద్యం అందించే లా చ‌ర్య‌లు తీసుకున్నారు., రాత్రి 10 గంట‌ల స‌మ‌యం వ‌ర‌కు కూడా అక్క‌డే ఉన్నారు. ప‌రిహారం కూడా ప్ర‌క‌టించారు.

 

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. నారా లోకేష్‌కు తాను కేవ‌లం ప‌ర్య‌వేక్షించ‌మ‌ని మాత్ర‌మే చెప్పాన‌ని.. కానీ తాను నేరుగా బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిపోయార‌ని.. నాయ‌కులు ఇలానే ఉండాల‌ని వ్యాఖ్యానించారు. నిజానికి నారా లోకేష్ శ్రీకాకుళానికి బ‌య‌లు దేరిన స‌మ‌యం నుంచే అంద‌రినీ అలెర్టు చేశారు. మంత్రుల నుంచి నాయ‌కులు, అధికారుల‌ వ‌ర‌కు కూడా  అంద‌రితోనూ ఫోన్ల‌లో మాట్లాడారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. ఇక‌, తాను నేరుగా రంగంలోకి దిగిన త‌ర్వాత‌.. బాధితుల ఆవేద‌న‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం కూడా చేశాన‌న్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ.. స‌మ‌ర్థ నాయ‌కుడిగా నారా లోకేష్‌కు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి మార్కులు ప‌డేలా చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: