తెలంగాణ మంత్రివర్గం బుధవారం సాయంత్రం జరిపిన సమావేశంలో అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం మరింత గౌరవం అందించే నిర్ణయాలు తీసుకుంది. గతంలోనే అందెశ్రీకి రాష్ట్ర గీత రచయితగా గుర్తింపు ఇచ్చి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రకటనలతో మరో అడుగు ముందుకేసింది.

అందెశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం కల్పించేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పోస్టు ప్రత్యేకంగా సృష్టించి నేరుగా నియామకం చేయనున్నట్లు సమాచారం. ఇది సాధారణ నియామక ప్రక్రియను అతిక్రమించి కుటుంబానికి ప్రత్యేక గౌరవం అందించే చర్యగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం వెనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలో ప్రభుత్వం స్మృతివనం నిర్మించనుంది. ఈ వనంలో రాష్ట్ర గీత రచయిత జ్ఞాపకార్థం ప్రత్యేక స్థూపం ఏర్పాటు చేస్తారు.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ స్ఫూర్తిని నిలుపుకునే చర్యగా ఈ నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.పాఠ్యపుస్తకాల్లో మరో ముఖ్యమైన మార్పు తీసుకొచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి పాఠ్యపుస్తకం మొదటి పేజీలో జయ జయహే తెలంగాణ గీతం ముద్రించాలని నిర్ణయించింది. ఈ గీతం రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో విద్యార్థులకు రాష్ట్ర గీతం పరిచయం కావాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు నిర్ణయాలు కలిపి అందెశ్రీ కుటుంబానికి రేవంత్ సర్కారు ఇచ్చిన బంపర్ ప్యాకేజీగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: