నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు ఉద్యోగాల పేరుతో జరిగిన భారీ మోసం కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వెల్త్ అండ్ హెల్త్ పేరుతో నడిచిన సంస్థ నిర్వాహకులు రాజారెడ్డి ఉమామహేశ్వర్ రెడ్డి వీరారెడ్డి శ్రీకాంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ ముఠా రాయలసీమలోని నిరుద్యోగ యువతను భారీగా మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.ప్రతినెల నలభై వేల రూపాయల జీతం వస్తుందని చెప్పి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు నిందితులు. ఉద్యోగం కావాలంటే ముందుగా మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని యువకులను నమ్మబలికారు.

కడప నంద్యాల అనంతపురం జిల్లాల్లోని సుమారు పన్నెండు వందల మంది నుంచి ఈ ముఠా డబ్బులు వసూలు చేసింది. మొత్తం మోసం రూ. 36 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.గత కొన్ని నెలలుగా జీతాలు రాకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు డబ్బులు సేకరించి వేరే ప్రాంతాలకు తరలించినట్టు గుర్తించారు. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.ఈ ఘటన రాయలసీమ జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది. నిరుద్యోగ యువత ఆశలను దుర్వినియోగం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మోసపూరిత సంస్థలపై పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. వసూలు చేసిన డబ్బులు తిరిగి రావాలని బాధితులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: