మంత్రిగా పదేళ్లు ఉన్న సమయంలో తనకు ఎంతో మంది భూముల కోసం వచ్చినా, డబ్బులు ఇస్తామన్నా అంగీకరించలేదని గుర్తు చేసుకున్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలోనే ఈ భారీ భూకుంభకోణానికి ఆమోదం తెలిపిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె నిర్దిష్ట ఆరోపణలు చేయడం గమనార్హమని పేర్కొన్నారు.
9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 30 శాతం రుసుముతో క్రమబద్ధీకరించే నిర్ణయం తీసుకున్నారని, 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. ఈ భూములు ఎవరి సొత్తో అని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ ఆస్తులను ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టడం సరికాదని హెచ్చరించారు.బీఆర్ఎస్ పాలనలో అజమాబాద్ భూములకు సంబంధించి చట్టం తీసుకొచ్చి, వంద శాతం రుసుము చెల్లించిన వారికి క్రమబద్ధీకరణ అవకాశం కల్పించామని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇతరుల చేతిలో ఉంటే 200 శాతం రుసుము వసూలు చేశామని చెప్పారు. అదే భూములను ఇప్పుడు చౌకగా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయం ప్రజా ఆస్తులను దోచుకునే ప్రయత్నమని ఆరోపించారు.ఈ విషయంలో రాజీ లేకుండా న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రప్పిస్తుందని స్పష్టమవుతోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి