ఈ పాలసీ రాష్ట్ర ప్రగతి కోసమేనని, పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి కల్పించే లక్ష్యంతో తీసుకున్నామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆయన చెప్పిన పేర్లలో ఒక్కరు కూడా ప్రభుత్వంలో లేరని ఎద్దేవా చేశారు.
ఆధారాలు ఉంటే చూపించమని, వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.శ్రీధర్ బాబు మాట్లాడుతూ, 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడు జీవోలు జారీ చేసి హైదరాబాద్‌లోని భూములను బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే జీవోల ఆధారంగా కొనసాగిస్తున్న పాలసీని కుంభకోణం అంటూ కేటీఆర్ నాటకం ఆడుతున్నారని విమర్శించారు.
పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇతర రాష్ట్రాల్లో 99 పైసలకే భూములు ఇస్తుంటే తెలంగాణలో రాయితీలతో పాటు పారదర్శక పాలసీ అమలు చేస్తున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఫ్రీహోల్డ్ హక్కులు ఉన్నవారు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చని, ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని కేటీఆర్‌ను హెచ్చరించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి