ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 200కు పైగా గ్రామాలకు కొత్త రోడ్లు వేశామని అచ్చెన్నాయుడు వివరించారు. మిగిలిన 284 గ్రామాల్లో కూడా రెండేళ్లలోపు రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అనుమతుల విషయంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. గిరిజనుల ఆరోగ్యం, విద్య, రవాణా సౌకర్యాలు మెరుగుపడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
వ్యవసాయ రంగంలో ప్రకృతి విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడకుండా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా లాభసాటి వాణిజ్య పంటల గురించి రైతులకు అవగాహన కల్పించి, మార్కెట్ అవకాశాలు సృష్టించాలని సూచించారు.
జిల్లాలోని రైతు సంఘాలతో సమన్వయం పెంచి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు.ఈ సమీక్ష ద్వారా పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కొత్త ఊపిరి పోసినట్టయింది. రహదారులు, ఆరోగ్యం, వ్యవసాయం రంగాల్లో సమగ్ర చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ దృశ్యం మళ్లీ కనిపించకూడదన్న ఆయన సత్సంకల్పం జిల్లా అధికారుల్లో ఉత్సాహం నింపింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి