దీంతో దేశంలో వాణిజ్య సౌలభ్యం గణనీయంగా పెరిగి, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో భారత్ ముందుకు దూసుకెళ్తోంది.వేతనాల కోడ్ ద్వారా కనీస వేతనం జాతీయ స్థాయిలో నిర్ణయించబడుతుంది. బోనస్, ఓవర్ టైమ్, గ్రాట్యుటీ వంటివి స్పష్టమైన నియమాలతో అందరికీ ఒకేలా వర్తిస్తాయి. సామాజిక భద్రత కోడ్ అన్ని రంగాల కార్మికులకు పింఛను, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్, మాతృత్వ సెలవు వంటి సౌకర్యాలను విస్తరిస్తుంది. గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులను కూడా ఈ వలయంలోకి తీసుకొచ్చి సామాజిక భద్రతా జాల అందిస్తోంది.
ఇది అసంఘటిత రంగంలోని కోట్ల మంది కార్మికుల జీవితాలను మార్చే అవకాశం ఉంది.పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారా హైర్ అండ్ ఫైర్ విధానం సులువవుతుంది. 300 మంది వరకు కార్మికులున్న సంస్థలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా పోయింది. ట్రేడ్ యూనియన్ గుర్తింపు, స్టాండింగ్ ఆర్డర్స్ వంటివి సరళీకృతమయ్యాయి. దీంతో కంపెనీలు త్వరగా నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెంచే అవకాశం పెరిగింది.
వృత్తి భద్రత-ఆరోగ్య కోడ్ ద్వారా ఫ్యాక్టరీలు, గనులు, డాక్‌యార్డులతో పాటు ఐటీ రంగం కూడా భద్రతా ప్రమాణాల పరిధిలోకి వచ్చాయి. మహిళలు రాత్రి పూట పని చేయడం సాధ్యమవుతుంది.ఈ నాలుగు కోడ్‌లు కార్మికులకు ఎక్కువ భద్రత, మెరుగైన వేతనాలు, సామాజిక రక్షణ అందిస్తూనే, వ్యాపారులకు సౌలభ్యం కల్పిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంటుంది. కొన్ని రాష్ట్రాలు ఇంకా పూర్తిగా అమలు చేయకపోవడం మాత్రమే మిగిలిన సవాలు. మొత్తంమీద ఈ సంస్కరణలు భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక శక్తిగల దేశంగా మరింత బలోపేతం చేస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి