నెల్లూరు జిల్లాలో జరిగిన పెంచలయ్య హత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచలయ్య గంజాయి వ్యతిరేక పోరాటంలో చురుకుగా పాల్గొని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసిన వ్యక్తి అని ఆయన కొనియాడారు.కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు చేసుకుంటూ నెల్లూరు రూరల్ పరిస్థితులు ఏమాత్రం తెలియని వ్యక్తిగా వ్యాఖ్యానించారు కోటంరెడ్డి.

గంజాయి వ్యాప్తిని అరికట్టేందుకు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్డీటీ కాలనీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పెంచలయ్యను హతమార్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే ఉన్నారని ఆయన ఆరోపించారు.గంజాయి వ్యాపారాన్ని పెంచి పోషించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టంగా ఆరోపణలు గుప్పించారు. నిజాలు తెలుసుకోకుండా దొంగ దొంగ అని అరిచినట్లు కాకాని ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే కాకాని ఏకైక పనిగా మారిందని ఎద్దేవా చేశారు.పెంచలయ్య భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కరు కూడా రాకపోవడం దురదృష్టకరమని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేం మాత్రం పెంచలయ్య కుటుంబానికి అండగా నిలుస్తామని, వారి పట్ల సంపూర్ణ బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన జిల్లా రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: