పేరు మార్చి, పేరు మార్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్ దీక్ష గురించి మాట్లాడే వారికి తెలంగాణ చరిత్ర తెలియదని తలసాని ధ్వజం ఎత్తారు. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు కలిసి సచ్చినట్టు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ చేశారని గుర్తు చేశారు. మెడ వంచి, ప్రజా ప్రతినిధులను నిలదీసి తెలంగాణ సాధించారని, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ఇవ్వలేదని స్పష్టం చేశారు. భారతదేశ ముఖచిత్రంపై తెలంగాణను ముద్రించిన చరిత్ర కేసీఆర్ కే చెందుతుందని ఆయన గర్వంగా పేర్కొన్నారు.
ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కూర్చున్న కుర్చీలు, అనుభవిస్తున్న అధికారం కేసీఆర్ భిక్ష అని తలసాని ఘాటుగా విమర్శించారు. మేము తిట్టడం మొదలుపెడితే మీరు కుర్చీల్లో కూర్చోలేరని హెచ్చరించారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చి, అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పాలు ఏవో నీళ్లు ఏవో ఇప్పటికే తేలిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని తలసాని పిలుపునిచ్చారు. ఎన్ని చేసినా మూడేళ్ల తర్వాత ఫలితం ఏమవుతుందో చూడండి అని సవాలు విసిరారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి