విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవి ఇవ్వాలని భావిస్తున్నారని ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది పూర్తయితే కాంగ్రెస్‌లో పెద్ద మార్పు అవుతుంది. సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి, ఆయన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన హైకమాండ్‌లో నడుస్తోందని ప్రచారం. ఇది జరిగితే కాంగ్రెస్‌లో మొదటిసారిగా భర్త - భార్య స్థాన మార్పు అయినట్లవుతుంది. ఇక మంత్రి శ్రీధర్ బాబును పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆ ప్లాన్ కుదరకపోతే, ఆయనకు హోంమంత్రి వంటి అత్యంత కీలక బాధ్యతలు ఇవ్వాలని ఢిల్లీ నాయకత్వం యోచిస్తోంది.
సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు క్యాబినెట్‌లో నుండి తప్పనిసరిగా ఎగ్జిట్ చూపిస్తారని టాక్ మరింత బలమవుతోంది. వివాదాల్లో ఇరుక్కున్న పొన్నం ప్రభాకర్ స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రిపదవి ఖాయం అని అంటున్నారు. పొన్నంకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశమూ ఉందని ప్రచారం జరుగుతోంది. ఫైనల్‌గా 4 నుంచి 5 మంది మంత్రులు బయటకు వెళితే... కొత్తగా 4 నుంచి 6 మంది క్యాబినెట్‌లోకి వస్తారంటున్నారు. ఈ మార్పులు నిజమైతే తెలంగాణ కాంగ్రెస్‌లో మరో పెను సునామీ తప్పదు. పార్టీలో గ్రూపుల గోల మరింత ఎక్కువ అవుతుందనడంలో సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి