రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై గౌరవం లేదని స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడం ఉప ఎన్నికలకు భయపడటమేనని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో పల్లెలన్నీ ప్రజావ్యతిరేకతతో నిండిపోయాయని పేర్కొన్నారు. పార్టీ మారిన వారిని ప్రజలు ఇప్పటికే అనర్హులుగా తీర్చిదిద్దారని అన్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తోందని విమర్శించారు.
స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారాలు చేసినా స్పీకర్ దృష్టికి రాలేదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని ఫోటోలకు పోజులివ్వడం మాత్రమే సరిపోదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.కేటీఆర్ విమర్శలు రాహుల్ గాంధీపై సూటిగా దాడి చేశాయి.
స్వంత తండ్రి తెచ్చిన చట్టాన్ని గౌరవించలేని నాయకుడిగా రాహుల్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. ఢిల్లీలో రాజ్యాంగాన్ని కాపాడతామంటూ మాటలు చెప్పి తెలంగాణలో దాన్ని ఉల్లంఘిస్తున్నారని హరీష్ రావు కూడా ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి ఎదురవుతోందని బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. రేవంత్ పాలనలో గ్రామాల్లో వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి