గ్రూపు-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంపై వెలువడే తుది ఆదేశాలకు లోబడే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎ్‌స.రామచంద్రరావు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన 15/2011(లిమిటెడ్‌), 18/2011 (రెగ్యులర్‌) నోటిఫికేషన్ల ప్రకారం నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది బి.రచనారెడ్డి వాదించారు. కొన్ని జవాబుపత్రాలను రెండుసార్లు, మరికొన్నింటిని మూడుసార్లు మూల్యాంకనం చేసినట్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. ఈ వ్యాజ్యంలో వెలువడే తదుపరి ఆదేశాలకు లోబడే అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలు ఉంటాయని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: