‘1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మార్చి 31 వరకూ పాఠశాలలు ప్రారంభించరాదు.. ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.. ప్రాజెక్టు వర్క్ ఆధారంగా ఒకటి నుంచి ఎనిమిది విద్యార్థులను ప్రమోట్ చేస్తాం.. బోర్డు పరీక్షలున్న పది, ఇంటర్ విద్యార్థులకు తర్వలోనే తరగతులు ప్రారంభిస్తాం.. భౌతికదూరం సహా ఇతర కరోనా నిబంధనలు పాటిస్తూ వారంలో ఒకటి లేదా రెండు రోజులు తొమ్మిది, ఇంటర్ తరగతులు నిర్వహిస్తాం’ అని ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహన్ అన్నారు.
ప్రయివేట్ పాఠశాలలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని, తరగతులు నిర్వహించకుండా ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన 10వేల పాఠశాలలను ప్రారంభించనున్నట్టు వివరించారు. విద్యార్థులకు యూనిఫామ్‌లు సిద్ధం చేసే బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు సీఎం తెలిపారు. క్లాత్‌లను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద, గెస్ట్ టీచర్స్‌ను వచ్చే ఏడాది కొనసాగుతారు.. ఏటా వారికి గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. నూతన విద్యా విధానంలో భాగంగా 1,500 ప్రభుత్వ పాఠశాలల్లో కేజీ-1, కేజీ-2 తరగతులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటను అనుసరిస్తాయేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి