
దేశంలో ఎక్కువ శాతం విద్యార్థులు ఇంజనీరింగ్ పాస్సయ్యి ఉంటారు.. వారిలో కేవలం కొంత మంది మాత్రమే ఉద్యోగాల లో సెటిల్ అవుతున్నారు.. మిగిలిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు.. అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది..ప్రభుత్వ రంగ సంస్థ, మినీ రత్న హోదా ఉన్న బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, లీగల్ అసిస్టెంట్ పోస్టుల కోసం సంస్థ దరఖాస్తులను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆసక్తి ఉన్నవారు ఈ నెలాఖరు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. తాజా ఐటీ టూల్స్‌పై ఈ పరీక్ష ఉండవచ్చు.అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఇంటర్వ్యూ ను రెండు దశ ల్లో నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ లేదా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిసెర్చర్, లీగల్ అసిస్టెంట్ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది.
సాఫ్ట్‌వేర్ డెవలపర్ లేదా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ విభాగంలో మూడు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది..
ఈ పోస్టులకు విద్యార్హతల వివరాలు..
ఇంజనీరింగ్ లో.. కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ చేసిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అర్హులు. వీటితో పాటు నెట్‌వర్క్ ప్రోటోకాల్స్‌పై అవగాహన, కోవర్ట్ ఛానెల్స్, షెల్ స్క్రిప్టింగ్ వంటి అంశాలపై పట్టు ఉండాలి.ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు; లేదా ఎం.టెక్ చదివిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టుకు అప్లై చేయవచ్చు. ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో లేదా మరే ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు...ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..