ఇక ఆఫీషియల్ నోటీసు ప్రకారం చూసుకున్నట్లయితే టెర్మినల్ సెమిస్టర్ ఇంకా ఫైనల్ ఇయర్ పరీక్షలు (2020-2021) తప్పనిసరిగా ఆగస్టు 31 లోపు నిర్వహించాల్సి ఉంటుందట. ఇక అలాగే కరోనా మహమ్మారి దృష్ట్యా అక్టోబర్ 31 వరకు కూడా ప్రవేశాలను రద్దు చేసిన విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయం రద్దు ఫీజు వసూలు చేయకూడదట.డిసెంబర్ 31 వరకు ప్రవేశాన్ని క్యాన్సిల్ చేసిన విద్యార్థికి ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా 1000 రూపాయలు వసూలు చేయవచ్చు. ఇక సెషన్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో నడుస్తుందో లేదో నిర్ణయాధికారం యూజీసీ ఆయా రాష్ట్రాలకు వదిలివేయడం జరిగింది. విద్యాసంస్థల క్యాలెండర్, మార్గదర్శకాలను ఎన్‌ఐసీటీఈ మరియు ఎన్‌సీటీఈ ఇంకా బీసీఐ అలాగే ఎన్‌ఎంసీ, ఇంకా డీసీఐ తో పాటు ఎన్‌ఐసీ మరియు పీసీఐ ఇంకా ఆయుష్ వంటి విద్యాసంస్థలతో సంప్రదించిన తర్వాత జారీ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి