ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ముఖ్యమైన విషయం. మరో రెండ్రోజుల్లో స్టార్ట్ కావల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల హాల్ టికెట్లు అనేవి విడుదలవ్వడం జరిగింది.ఇక వాటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 22 వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకూ కూడా జరగనున్నాయి. ఏప్రిల్ 7 వ తేదీ నుంచి స్టార్ట్ కావల్సిన పరీక్షలు అనేవి జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీల కారణంగా వాయిదా పడటం అనేది జరిగింది. ఇక మరో రెండ్రోజుల్లో అంటే మార్చి 11 వ తేదీ నుంచి కూడా ఇంటర్నీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు అనేవి స్టార్ట్ కానున్నాయి. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విడుదల చేయడం అనేది జరిగింది. ఇక ఈ హాల్ టికెట్లను చాలా సులభంగా ఇంట్లోనే కూర్చుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..ఇక ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీషియల్ వెబ్‌సైట్ అయిన https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ని మీరు ఓపెన్ చేయాలి.


ఓపెన్ చేశాక హోమ్‌పేజ్‌లో Download Practical Hall Tickets march 2022 పై క్లిక్ చెయ్యాలి. అలా క్లిక్ చేసిన తరువాత మరో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక ఇందులో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్‌కు సంబంధించిన రోల్ నెంబర్ లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ని మీరు ఎంటర్ చేయాలి. ఆ తరువాత Download Hall Ticketపై క్లిక్ చెయ్యాలి..అలా క్లిక్ చేసిన తరువాత ప్రింట్ తీసుకుంటే చాలు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్ధుల రోల్ నెంబర్‌ను వారి కళాశాల నుంచి పొందాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు నెంబర్‌తో కూడా హాల్ టికెట్ ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 22 వ తేదీ నుంచి మే 12 వ తేదీ వరకు కూడా జరిగే మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు అనేవి వేరుగా ఉంటాయి. ఇక అవి త్వరలో విడుదల కానున్నాయి. ఇక ఇవి కూడా ఇదే వెబ్‌సైట్ నుంచి ఇదే పద్ధతిలో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: