నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IISERలో ఉద్యోగాలు?

ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులకు చక్కటి శుభవార్త.. అదేంటంటే..గవర్నమెంట్  ఆఫ్  ఇండియాకి చెందిన భోపాల్‌ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, డిప్యుటేషన్‌, ఒప్పంద ప్రాతిపదికన 75 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యండి.దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/బీఈ/బీటెక్‌/ పీజీ/ఎంబీబీఎస్/ఎంసీఏ/బీఎస్సీ/పీహెచ్‌డీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు 30 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి. పదవ తరగతి నుంచి పోస్టులు వున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ వీటికి అప్లై చేయవచ్చు.


ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్ర్కీనింగ్‌ టెస్ట్, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.అక్టోబర్ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; రిక్రూట్‌మెంట్ సెల్ రూమ్ నంబర్ 108, మొదటి అంతస్తు, ప్లాస్మా బిల్డింగ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భోపాల్ భోపాల్ బై-పాస్ రోడ్, భౌరి, భోపాల్ 462 066 మధ్యప్రదేశ్, భారతదేశం. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://iiserb.ac.in/join_iiserb. ని ఓపెన్ చేయండి.ఇందులో పూర్తి వివరాలను తెలుసుకొని ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: