భారీగా తగ్గిన బంగారం ధరలు..అదే దారిలో వెండి ధర..24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.51,270 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.110 తగ్గింది. అదే తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,016 ఉంది.ప్రస్తుతం వెండి ధర కిలో రూ. 62 , 000 లకు చేరుకుంది. వెండి సామాన్లు, వస్తువులు తయారీ తగ్గడంతో వెండి దేశ వ్యాప్తంగా డిమాండ్ తగ్గింది. దసరా కు తగ్గిన బంగారం , వెండి ధరలు దీపావళికి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని తాజాగా వెల్లడైంది.