ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఇన్వెస్టర్లు మాత్రమే బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. అయితే రిటైల్ మార్కెట్లలో మాత్రం బయట బంగారానికి డిమాండ్ బాగా పడిపోయింది. ప్రస్తుతం ధరలను చూసి వెనుకంజ వేసే పరిస్థితి. దీంతో రిటైల్ మార్కెట్ లేకుండా పోయింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.260 వరకు పెరిగి రూ.55,760 కు చేరుకుంది. నిన్నటి వరకు రూ.54,600కు పైన ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.60కు పైగా పెరిగి రూ.51 వేలకు పైకి చేరుకుంది. కిలో వెండి రూ.2,000 పెరిగి రూ.67,000కు చేరుకుంది.
గత కొద్ది నెలలుగా బంగారాన్ని ముందుకు నడిపించిన కారకాలు ఇప్పుడు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సమీప భవిష్యత్తులో గోల్డ్ టార్గెట్ ఔన్స్ 2,100గా ఉందని చెబుతున్నారు. డిసెంబర్ నాటికి 2,350 డాలర్లకు పెరిగినా కొట్టి పారేయలేమని అంటున్నారు.ఆ రకంగా చూస్తే దీపావళి నాటికి 10 గ్రాముల పసిడి రూ.65వేలు, కిలో వెండి రూ.90వేలకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ ఏడాదిలో బంగారం టార్గెట్ ఔన్స్ 2,280 లేదా రూ.62,000గా ఉంటుందని, వెండి రూ.75 వేలకు చేరుకుంటుందని కొందరు నిపుణులు ఇదివరకే అంచనా వేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి