10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ 44,500లకు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.48,490కి చేరుకుంది. వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ.67,600లకు చేరుకుంది.

మనం సాధారణంగా బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు క్యారెట్ లేదా కే వంటి పదాలను వింటూ ఉంటాము. మరి 18, 22, 24 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏంటి ? అసలు క్యారెట్ అంటే ఏంటో తెలుసా ? బంగారం ఎంత స్వచ్ఛమైనదో తెలుసుకోవటానికి క్యారెట్ అనే పదాన్ని వాడతారు. బంగారం భాషలో చెప్పాలంటే దాని విలువను, నాణ్యతను క్యారెట్ లుగా కొలుస్తారు. స్కేల్‌పై 0 నుండి 24 క్యారెట్లుగా బంగారం రేట్ చేస్తారు. బంగారు ఆభరణాలను తయారు చేయడానికి, రాగి, నికెల్, వెండి, పల్లాడియం వంటి ఇతర లోహాలను ఉపయోగిస్తారు.

ఎలాంటి లోహాలను కలపకుండా ఉన్న స్వచ్ఛమైన బంగారాన్ని 24 క్యారెట్ బంగారం అని అంటారు. ఇందులో 99.99% బంగారం ఉంటుంది. 24 క్యారెట్ బంగారం కూడా 100% స్వచ్ఛమైంది కాదా ? అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ 100 శాతం స్వచ్ఛమైన బంగారం రూపాన్ని రూమ్ ఉష్ణోగ్రత వద్ద మార్చాలంటే కష్టం ఇది పెళుసులుగా ఉంటుంది. అందుకే ఖనిజాన్ని వెలికితీసిన తర్వాత అది 99.99%స్వచ్ఛత స్థాయికి చేరుకునే వరకు ప్రాసెస్ చేయబడుతుంది. దీనిని బంగారు నాణేలు, బార్ల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. 24 కె బంగారం ప్రత్యేకమైన పసుపు రంగులో ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ ప్రతి భారతీయ బంగారు నాణెం మీద స్టాంప్ చేయబడి ఉంటుంది.

22 కారట్ గోల్డ్ అంటే బంగారం 22 భాగాలు, రాగి, జింక్ వంటి 2 భాగాలు ఇతర లోహాలతో కలిపి ఉంటుంది. దీనిని బంగారాన్ని "916 బంగారం" అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 22కే బంగారాన్ని బంగారు ఆభరణాలను చేస్తారు.

18 క్యారెట్ గోల్డ్అంటే... 75% బంగారం, 25% ఇతర లోహాలు కలిపి ఉంటుంది. స్టోన్స్ తో చేసే ఆభరణాల తయారీలో ఈ బంగారం ఉపయోగిస్తారు. ఇంకా ఇందులో జింక్, రాగి, నికెల్ మొదలైన లోహాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: