ప్రముఖ నటి ప్రత్యూష మధ్యతరగతి కుటుంబంలో జన్మించి 1998లో విడుదలైన రాయుడు అనే చిత్రం ద్వారా వెండితెర పైన ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీరాములయ్య, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలో ప్రత్యూష , తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి 2022 ఫిబ్రవరి 23న ఆత్మహత్య యత్నం చేసింది. అయితే ఈ ప్రయత్నంలో ప్రత్యూష మరణించగా సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు.


సిద్ధార్థ రెడ్డి వల్లే తన కూతురు మరణించింది అంటూ ప్రత్యూష తల్లి సరోజిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సిద్ధార్థ రెడ్డిని అరెస్టు చేశారు.సుమారుగా 24 సంవత్సరాలుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో నాంపల్లి కోర్టు సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. 2011లో హైకోర్టు ఈ శిక్షను రెండేళ్లు తగ్గించి రూ.50 వేల రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుతో తన కూతురికి న్యాయం జరగలేదంటూ ప్రత్యూష తల్లి సరోజిని 2012లో సుప్రీంకోర్టుని ఆశ్రయించాక అప్పటినుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. 2025లో నవంబర్ లో సిద్ధార్థ రెడ్డి తనకు వేసిన జైలు శిక్షను సవాల్ చేస్తూ అప్పిల్ చేయగా, అతడి శిక్షణ పెంచాలి అంటూ ప్రత్యూష తల్లి సరోజిని కూడా పిటిషన్ వేసింది.

గత ఏడాది నవంబర్ నెలలో సుప్రీంకోర్టు ఈ కేసును రిజర్వ్ చేసింది. 2026 ఫిబ్రవరి 17న  ఈ కేసు పైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డిని పోలీసుల ముందు లొంగిపోవాలంటు ఆదేశాలను జారీ చేసింది. దీంతో ప్రత్యూష తల్లి మాట్లాడుతూ.. నాకు న్యాయం జరగలేదు నా కూతురు చంపబడిందని చెబుతున్నాను సాక్షాలను తారుమారు చేశారు. అన్ని సాక్ష్యాలు ఉండి ఉంటే జీవిత ఖైదీ పడేది. మునుస్వామి రిపోర్టును కోర్టులు కన్ఫర్మ్ చేయలేదు. ఆ రిపోర్టు తీసుకొని ఉంటే బాగుండేది అంటూ తెలిపింది. ప్రత్యూష డెడ్ బాడీ త్రీ సభ్య కమిటీ చూడలేదు ఎలా చనిపోయిందో ఆ కమిటీ వాళ్లకు కూడా తెలియదంటూ పలు రకాల ఆరోపణలు చేసింది సరోజిని. తన కూతురు హీరోయిన్గా ఎదిగితే తనకు దక్కదని ఉద్దేశంతోనే తన కూతురుపై అత్యాచారం చేశారని తెలిపింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా కుక్క చావు చేస్తారంటూ ఆమె ఎమోషనల్ గా మాట్లాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: