మతిమరుపు దేవుడిచ్చిన వరం అని, అంటుంటారు పెద్దలు.ఎందుకంటే కష్టాలను పదేపదే గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా, అవి మర్చిపోయి సంతోషంగా జీవించడం అవసరం కనుక.కానీ చిన్న చిన్న విషయాలను పదే పదే మర్చిపోతూ ఉంటే అదొక పెద్ద జబ్బు అని జాగ్రత్తపడాలి. ఉదాహరణకి తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, వస్తువులు పక్కనే ఉన్న వాటినే పదే పదే వెతుక్కుంటూ ఉండడం, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ని మర్చిపోవడం వంటివి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కానీ ఇవి రాను రాను వయసు మల్లే కొద్దీ అల్జీమర్స్ గా మారుతుందని, వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్జిమస్ బారిన పడకుండా యుక్తవయసులోనే కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం ఉత్తమం. అలాంటి అలవాట్లు ఏంటో తెలుసుకుందామా..

 మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడు కూడా చురుగ్గా ఉండడానికి కొంత శిక్షణ అవసరము. అదేంటంటే..

పుస్తకాలు చదవడం..
 అకాడమీ పుస్తకాలు చదవడం కన్నా,నవలలు,కథలు చదవడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని పరిశోధనల్లో తేలాయి. కావున ప్రతి ఒక్కరూ రోజులో కొంతసమయం కేటాయించి ఏదోక కథను కానీ, నవలలు కానీ చదవడం ఉత్తమం.


 కంపేర్ చేయడం..
అవును మనం ఏదైనా చదివింది మనకు ఎప్పటికీ గుర్తు ఉండాలంటే, ఏదైనా వస్తువుతో కానీ,జంతువుతో కానీ  పోల్చడం ద్వారా,మనకు ఎక్కువ కాలంపాటు గుర్తు ఉంటుంది

పజిల్స్ ఆడడం..
మన మెదడు చురుగ్గా ఉండాలంటే, పజిల్స్ ని ఎక్కువగా  ఆడుతుండాలి. కానీ ఈ పజిల్స్ మొబైల్లో కంప్యూటర్లలో ఆడకూడదు. ఇవి మన మెదడును మొద్దు బారడానికి దోహదం చేస్తాయి

 అరగంట నిద్ర..
మధ్యాహ్నం పూట అరగంట పాటు కునుకు తీయడం వల్ల,పని మీద ఏకాగ్రత పెరిగి తొందరగా పూర్తి అవుతుంది. మన మెదడు నిద్ర సమయంలో రిఫ్రెష్ అవుతుంది.

మంచి ఆహారం..
జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు కావలసిన 'జింక్ 'అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.మరియు ప్రాసెస్డ్ లేదా జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: