
మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడు కూడా చురుగ్గా ఉండడానికి కొంత శిక్షణ అవసరము. అదేంటంటే..
పుస్తకాలు చదవడం..
అకాడమీ పుస్తకాలు చదవడం కన్నా,నవలలు,కథలు చదవడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని పరిశోధనల్లో తేలాయి. కావున ప్రతి ఒక్కరూ రోజులో కొంతసమయం కేటాయించి ఏదోక కథను కానీ, నవలలు కానీ చదవడం ఉత్తమం.
కంపేర్ చేయడం..
అవును మనం ఏదైనా చదివింది మనకు ఎప్పటికీ గుర్తు ఉండాలంటే, ఏదైనా వస్తువుతో కానీ,జంతువుతో కానీ పోల్చడం ద్వారా,మనకు ఎక్కువ కాలంపాటు గుర్తు ఉంటుంది
పజిల్స్ ఆడడం..
మన మెదడు చురుగ్గా ఉండాలంటే, పజిల్స్ ని ఎక్కువగా ఆడుతుండాలి. కానీ ఈ పజిల్స్ మొబైల్లో కంప్యూటర్లలో ఆడకూడదు. ఇవి మన మెదడును మొద్దు బారడానికి దోహదం చేస్తాయి
అరగంట నిద్ర..
మధ్యాహ్నం పూట అరగంట పాటు కునుకు తీయడం వల్ల,పని మీద ఏకాగ్రత పెరిగి తొందరగా పూర్తి అవుతుంది. మన మెదడు నిద్ర సమయంలో రిఫ్రెష్ అవుతుంది.
మంచి ఆహారం..
జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు కావలసిన 'జింక్ 'అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.మరియు ప్రాసెస్డ్ లేదా జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.