మండే ఎండాకాలానికి స్వస్తి చెబుతూ ఇప్పుడు వర్షాకాలం ఆరంభమయ్యే సమయం వచ్చేసింది. కొద్ది రోజుల నుండి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు మెల్ల మెల్లగా పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు పడడం మనము చూస్తున్నాము.