అర‌టి పండు.. అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. వాస్త‌వానికి కొన్ని పండ్లు కొన్ని సీజన్స్ లలో మాత్రమే దొరుకుతాయి. కానీ, అర‌టి పండు మాత్రం అన్ని సీజ‌న్స్‌లోనూ దొరుకుతుంది. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించే ఈ అరటి పండ్లలో బోలెడు పోషకాలున్నాయి. అరటి పండులో సహజ సిద్ధమైన తీపి, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ అరటి పళ్ళు తినడం వల్ల శక్తి రావడమే కాకుండా రోగాలు రాకుండా చేస్తుంది.

 

అలాగే అరటిలో ఫైబర్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్ పోషకాలతోపాటూ, విటమిన్ సీ, ఇతర ఖనిజాలుంటాయి. అందుకే చాలా మంది ఏదో ఒక స‌మ‌యంలో అర‌టిపండును తింటారు. అయితే అర‌టి పండు ప‌ర‌గ‌డుపున మాత్రం తిన‌కూడ‌దంటున్నారు నిపుణులు. అర‌టి పండు ఆరోగ్యానికి మంచిదే కానీ.. పరగడుపున అరటి పండు తినకూడదు. అరటిలో మెగ్నీషియం బాగా ఉంటుంది. మార్నింగ్ మెగ్నిషియం బాడీకి అందండం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వ‌ల్ల అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.

 

అందుకే పరిస్థితుల్లోనూ పరగడుపున అరటిపండు తినకండి. అయితే మిగిలిన స‌మ‌యాల్లో అర‌టి పండు ఎంచ‌క్కా తినొచ్చు. ముఖ్యంగా డైటింగ్ చేస్తున్న వారు ఒక పూట భోజనం లేదా టిఫిన్ మానేసి రెండు, మూడు అరటి పండ్లు తింటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. అరటి పండ్లలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మలబద్ధకం సమస్య దూరం కావడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: